తెలుగు భాషను గౌరవిద్దాం తెలుగు మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం

Go Back

గడ్డ కట్టుకున్న మనసు

Vishwa January 22, 2019 14 Views

Listen Audio

గడ్డకట్టుకున్న మనసు
తన రాతలలో

అదే పనిగా చూస్తూ శూన్యంలోకి

గతం పూర్తిగా అనుభవించలేదు

అందుకే వర్తమానం అస్తవ్యస్తంగా ఉంది.

ఇది ఒక కవితేనా?

ఏదో ముళ్ళ కిరీటం తలకు తగులుకున్నట్లు

పచ్చి మిర్చి నాలుక ఆపై నశానానికి అంటుకున్నట్లు

క్షమించు నేస్తమా

నీ కన్నీటి బొట్లు నాకోసం వృధా కానీకు.

అర నగువు పెదవులపై పూసినప్పుడు

నాది గెలుపు అంటావు

కానీ దాని వెనుక ఎంత పెద్ద ఓటమి ఉందొ నీకేమైన తెలుసా?

గెలుపంటే.. ఓటమిని కనపడనీకుండా చేసే ప్రయత్నమే.. ఇలా ఆలోచించు

Comments

No comments yet.

Write a Comment
×