తెలుగు భాషను గౌరవిద్దాం తెలుగు మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం

Go Back

స్నేహితుడు

Vishwa January 22, 2019 16 Views

Listen Audio

నన్ను రాయమంటావ్..

నేను ఏ ఉలినో కలంగా తెచ్చుకుంటాను.

నా భావాలను చెక్కుతూ మధ్య మధ్యలో చూసుకుంటూ

నాకు నేను పరవశమౌతూ..

ఇదంతా నీ విశ్వాసమేమో నేను వ్రాయగలను అని,

శిల్పం పూర్తి అయింది అని నేను గళం విప్పేలోపే

నీ చేయి నా భుజం తడుతుంది
భేష్ అని

ఇదేనేమో స్నేహమంటే అని నాకర్థమయ్యేలోపే

నిలువెత్తు రూపంగా నిన్ను నీవు ప్రకటించుకొంటావు

ఓ స్నేహితుడా..

 

Comments

No comments yet.

Write a Comment
×