Articles - Samaanyudi Korika
Name: Admin

Published Date: 06-04-2016


సామాన్యుడి కోరిక

ఎన్నికలు... ఎక్కడ చూసినా ఒకటే సందడి. అభ్యర్థుల పాదయాత్రలు... ఓటర్ల ముంగిట సభలు, సమావేశాలు. ఎన్నడూలేని ఆప్యాయతలు... ప్రేమలు... స్నేహాలూ ఒలక బోస్తూ పలకరింపులు.... కరచాలనాలు... ఆలింగనాలు! ఎవరికి వారే తామే గెలవాలన్న పట్టుదల... ఆరాటం! ఎవరికి వారికి తామే గెలుస్తామన్న నమ్మకం! అదిగో... ఆ గుడి ముంగిట ఓ పదిమంది గుమిగూడారు ఎందుకో. అప్పుడే గుల్ళో నుంచి దేవుని దర్శనం చేసుకొని బయటకు వస్తున్న ఓ అభ్యర్థి చూశాడు వాళ్ళని. అంతే... వాళ్ళ ముందు నిలబడి ఉపన్యాసం మొదలుపెట్టేశాడు. '... కాబట్టి సోదరులారా... నా సోదర ఓటరులారా... మీ ఓట్లు నాకే వేసి నన్ను గెలిపిస్తే మీ అందరికీ ఎప్పుడూ... ఇప్పటిలాగే అందుబాటులో ఉంటానని అదిగో... ఆ గుళ్ళో వున్న భగవంతుడి సాక్షిగా హామీ ఇస్తున్నాను. కాబట్టి సోదరులారా... మీ పవిత్రమైన, అమూల్యమైన ఓటును నా ఎన్నికల గుర్తు... గోడమీద పిల్లికే వేయాలని ప్రార్థిస్తున్నాను...' ఆ గుంపులోంచి ఎవరో అన్నారు 'అదేం గుర్తండీ బాబూ..' 'అన్నన్నన్న... అలా తీసిపారెయ్యమాకండి. గోడ మీది పిల్లంటే... ఎంత సౌలభ్యం ఉందో తెలుసుకోండి మరి... నేను సొతంతరం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కదా... రేపు పెద్ద పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే... నేను సమయం చూసుకొని దాన్లోకి లటుక్కున గెంతెయ్యచ్చు. అంటే మనకెప్పుడూ అధికారంలో ఉండే సౌలభ్యం ఉందన్నమాట. కాబట్టి సోదరులారా... మనం అధికారంలో ఉంటే ఏ పనికావాల్నా సిటికెలో సేయించుకోవచ్చు. కాబట్టి సోదరులారా మీ ఓటు 'గోడ మీది పిల్లి' గుర్తుకే వేయమని మరీ మరీ ప్రార్థిస్తున్నాను...' అంటూ ఉపన్యాసం ముగించి మరో వేదికను వెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ గుడిలో కొలువున్న స్వామి వారికి కోరిన కోరికలు తీర్చేవాడన్న పేరుంది. అందుకే ఎన్నికల్లో నిలబడిన ప్రతి అభ్యర్థీ తాము సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్నామనే విషయాన్ని విస్మరించి, ఎన్నికల్లో నెగ్గితే మతరహిత ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తామన్న సంగతిని ఆదమరిచి... అభ్యుర్ధులెందరో ఆ కోవెలలో కొలువున్న కోరికలు తీర్చే కోమల హృదయుడి పేర అర్చనలు... అభిషేకాలు అశేషంగా... విశేషంగా జరిపించేస్తుంటారు. ప్రతి ఎన్నికలకూ ఇది తప్పనిసరి! అదేమిటో... ఎప్పుడు ఎందరు అభ్యర్థులు తమ విజయం కోరి విన్నపాలు ఎన్ని చేసుకున్నా... ఒక్కరు మాత్రమే ప్రత్యర్థులపై విజయం సాధించడం జరుగుతుంది. అయినా అభ్యర్థులు మా త్రం తమ అభ్యర్థనలు ఆ దేవదేవునికి విన్నవించడం మానలేదు. ఈసారీ అదే తంతు. ఒక్కొక్కరుగా వస్తున్నారు. వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. తమ విన్నపాలను వినయవిధేయతలతో వినిపించుకుంటున్నారు. అదిగో... కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న పార్టీ తరఫు అభ్యర్థి.. అందునా తండ్రి మీదనే పోటీ చేస్తున్న అభ్యర్థి తన వేడికోలు విన్పించడం కోసం స్వామివారి ముందు నిలబడి చేతులు జోడిస్తున్నాడు. ఏం కోరుకుంటున్నాడో విందామా మరి?

'స్వామీ.... నేను ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. మా తండ్రి గారి మీదనే ప్రత్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్నాను. 'దైవ స్వరూపులైన తండ్రిగారి మీదనా... నీ పోటీ' అని కోప్పడతారేమో తమరు. అలా నన్ను మందలించే అధికారం తమకెప్పుడూ ఉంది. కానీ దానికి వినయంగా నేను చెప్పుకుంటున్న సమాధానం ఆలకించండి స్వామీ... నాన్నగారు ఇంతకు ముందెన్నో ఎన్నికల్లో నెగ్గి, ప్రజల కోసం అహరహం శ్రమించి ఎంతో సేవ చేశారు. అలాగే మా ఆస్థులు కూడా బాగా పెంచారనుకోండి. ఆ విషయం మీకు మాత్రం తెలియదా? ఆయన వయసూ పైబడింది. ఆరోగ్యమూ అంతంత మాత్రమే. ఇంకా ఈ రాజకీయాలెందుకండీ మీకు... విశ్రాంతిగా కాలం గడుపుకోండి... అంటే వినడం లేదు. అందుకే ఇలా నేను నిలబడవలసి వచ్చింది. ఆయన ఓటమి పాలైతేనన్నా ప్రశాంతిగా విశ్రాంతి తీసుకుంటారని. ఈ నా ఉద్దేశాన్ని మన్నించి, నన్నుగెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను... అని రెండు చెంపలూ వాయించుకొని ఓ అరడజను గుంజీలు తీసి బయటకొచ్చాడు. మరికొద్దిసేపటికి కొడుకుపై పోటీ చేస్తున్న ఆ తండ్రి గుడిలో ప్రవేశించాడు. అర్చకస్వామి స్వామివారికి దీపధూపానంతరం నైవేద్యం సమర్పించి, శఠగోపం తలపై ఉంచి, తీర్థ ప్రసాదాలందించి, అభ్యర్థిని ఒంటరిగా స్వామి ముందు వదిలి ప్రక్కకు వెళ్ళిపోయాడు.... మనసులో మాట భగవంతునికి విన్నవించుకోవడానికి వీలుగా. ఆ తండ్రిగారి కోరికేమిటో వినాలని ఉంది కదూ మీకు? మరి వినండి.... 'అయ్యా.. దేవతలారా...' గర్భగుడిలో ఉన్నది ఒకే దేవతామూర్తి అయినప్పటికీ ఎందుకైనా మంచిదని అందరినీ సంబోధిస్తూ వేదిక మీద ఉపన్యాసం లెవల్లో కోరుకోవడం ప్రారంభించాడు.' నేను ఇన్నాళ్ళూ ప్రజల కోసం ఎంత శ్రమపడ్డానో... ఆలాగే నా కోసం కూడా అనుకోండి... మీకు తెలియంది కాదు. ఇప్పుడు నాకు పోటీగా నా కొడుకు నిలబడ్డాడు. ఇదేంటిరా అంటే 'నువ్వు ముసలోడివైపోయావు. ఇంకా నువ్వే కుర్చీ పట్టుకువేళ్ళాడితే నేనెప్పుడెక్కాలి' అంటాడు. ఆ కుర్రసన్నాసికేం తెలుసు స్వామీ నా సత్తా? ఎవణ్ణి ఎప్పుడు ఎలా నొక్కాలో... సొమ్ములు ఎట్టా నొల్లుకోవాలో ఆడికేం తెల్సు? ఆవేశం తప్ప ఆలోచనలేని పీనుగ. నేనంటే ఆ అధికార పక్షమోళ్ళకి హడలు. మరొకరెవరైనా అయితే నా మీద నెగ్గడం కష్టం. అందుకే నా కొడుకుని నా మీదకు ఎగదోశారు. పిచ్చి సన్నాసి... అమాయకుడు... ఆణ్ణి కాదు గానీ నా మీద దయచూపించండి సామీ.. మరి వెళ్ళొస్తా సామీ...' అంటూ గుడి బయటకు వచ్చేశాడు అతగాడు. అరె.. ఆవిడెవరో మరీ ఆర్భాటంగా వస్తోంది చూడండి... ఆవిడ కేంద్రంలో ప్రభుత్వ పార్టీని బలపరుస్తున్న రాష్ట్రంలోని అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోందిట! చూడండి... మరీ కలికాలం కాకపోతే ఆవిడ కేంద్రంలో ప్రభుత్వ పార్టీని బలపరుస్తున్న రాష్ట్రంలోని అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోందిట! చూడండి... మరీ కలికాలం కాకపోతే... ఆవిడ భర్త మీదనే పోటీకి దిగిందట. అదిగో ఆలయ అర్చకులు ఆవిణ్ణి ఒక్కతినీ దేవుడి ముందు వదిలి పక్కకి వచ్చేశారు. అప్పుడే ఆవిడ తన కోర్కెల దండకం మొదలుపెట్టేసింది. విందాం రండి మరి!

'ఓటరు మహాశయులకు నమస్కారం' అన్నట్టుగా రెండు చేతులూ పైకెత్తి భగవంతుడి విగ్రహం ముందుకు చాపుతూ నమస్కారం పెట్టింది. 'అయ్యోరూ.. నేను అసెంబ్లీకి మా ఆయన మీదే నిలబడుతున్నాను. తప్పులేదు సామీ! రోజూ తప్పతాగి ఇంటికొచ్చి నన్ను తన్నడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. నా ఒళ్ళు హూనం చేసేస్తున్నాడు సామీ. ఆణ్ణి ఎలా దారికి తేవాలో తెల్వక ఇలా చెయ్యాల్సొచ్చింది. ప్రజల కోసం ప్రభుత్వపోళ్ళు ఇచ్చిన సొమ్ముతో ఇలా సోకులు చేస్తున్నాడు. చేతిలో పైసలు లేకపోతే నన్నా ఇంట్లో ఓ మూల పడుంటాడేమోనన్న ఆశ. చూడండి సామీ... సంసారమే సరిగ్గా నడపలేనిది మీసేవలేం జేస్తద'ని పెచారం చేస్తున్నాడంట. కడుపు చించుకుంటే కాళ్ళమీద పడిద్దని... నా సంసారం గుట్టు నేనే రట్టు చేసుకోవలసొస్తంది. సామీ... నీకు తెల్వదా? ఆయనగారి సంపాదనంతా... అదే సామీ పెజల నోట్లో మన్ను, మశానం గొట్టి దోసుకున్న సొమ్ములు... ఆయన్నీ ఆ మెరకీధి మహాలచ్చిమికే పట్టుకెళ్లి ఇస్తున్నాడు. ఇంక నేను సంసారం ఎట్టాసెయ్యాలంట సెప్పు సామీ! అందుకే నాలాంటి ఆడకూతుళ్లు ఎవ్వళ్ళకీ వెరకీధి మాలచ్చిమీల బెడద లేకుండా సెయ్యాలని ఈ ఎలచ్చన్లలో నిలబడుతున్నాను. నా కష్టం నీతో సెప్పుకున్నాను మరి... ఎన్నికల్లో నెగ్గించి అసెంబ్లీకి పంపమని కోరుకుంటున్నాను. అన్నట్టు సామీ... ఎమ్మెల్లేనేనయితే నా మొగుడు అధికారం సెలాయిద్దామనుకుంటాడేమో... అలాసేస్తన్నారంటగదా సాలామంది! పెళ్ళాం ముఖ్యమంత్రి అయితే మొగుడు ఎనకాతలనుండి సెక్రం తిప్పేవాడంట కదా సామీ... అట్టాంటి పనులు సెయ్యకుండా మా ఆయన్ని నువ్వే ఓ కంట కనిపెట్టాల మరి. వెళ్ళొస్తా సామీ...' అంటూ ఆవిడ గారు ఇలా బయటకొచ్చిందో లేదో ఆవిడ భర్తగారు అలా వచ్చారు దైవ దర్శనం కోసం. ఎదురొచ్చిన భార్యామణివంక కొరకొరా చూశాడు. మూతి ముఫ్ఫై మూడు వంకర్లు తిప్పుతూ ముందుకెళ్ళిపోయింది ఆవిడగారు. మరి ఆ భర్తగారి విన్నపాలేమిటో ఆలకిద్దాం రండి మరి. 'అయ్యా దేవుడుగారూ... నమస్కారాలండీ... అసలీ పెపంచకంలో ఆడోళ్ళకి భర్తలంటే గవురం లేకుండా పోతందండీ! అందుక్కారణం మా రాజకీయపోళ్ళేలెండి.. మా ఆడపడుచులూ... మా ఆడపడుచులూ అంటూ ముఖ్యమంత్రి నెత్తినెక్కించుకొని మగోల్లందర్నీ సులకన చేసిపడేశారు కదా సామీ! బాంక్ లోన్లు ఆడాళ్ళకేనంట. గాసుపొయ్యిలు ఆల్ల పేర్నేనంట. రేషన్ కార్డులు ఆల్ల పేర్నేనంట. ఇంక అన్నీ ఆల్లకే యిచ్చేత్తే మగోల్లం ఏటైపోతాం సామీ. అందుకే ప్రతిపచ్చం పార్టీ అభ్యర్థిగా పోటీ సేద్దాం అని నేనూ సూస్తే ఆ పెబుత్వపోళ్ళు మాయావిణ్ణి రెచ్చగొట్టి... నా మీదకే ఉసిగొల్పి ఆల్లపార్టీ టిక్కెట్టు ఇచ్చేసారు. ఇక సూసుకోండి సామీ... మా ఆవిడ ఒకటే రెచ్చిబోతోంది. నేను ఒట్టి తాగుపోతునంట, తిరుగుబోతునంట. అంచేత నాకు ఓటు ఎయ్యకూడదంట. నీతో అబద్ధమెందుకు గానీ... సామీ ఏదో నలుగురు పెద్దోళ్ళతోనూ తిరుగుతుంటానా గవుర్నం కోసం కాస్త చుక్కేసుకొనే మాట నిజమే. అప్పుడప్పుడూ హుషారు కోసం ఆ మెరికీధికెళ్లిన మాట నిజమే. అంత మాత్రాన నేను తాగుబోతునయిపోతానా... తిరుగు బోతునయిపోతానా? పంచాయితీ పెసిడెంటుగా ఎనకేసిన సొమ్ముల్ని ఆ మెరకీధి మాలచ్చికి పెట్టేస్తాన్నానంటది. నాల్గురూపాయలట్టా గిరాటెట్టకపోతే పాపం అది మాత్రం ఎట్టా బతుకుద్ది సామీ. సాటి ఆడదై వుండి ఆ మాత్రం ఆలోచించకపోతే ఎట్టాసామీ? సామీ... సివరగా నేను కోరుకొనేదేంటంటే మాయావిణ్ణి ఓడిచ్చి.... నన్ను గెలిపించి ఆ యధికార పార్టీ ఓళ్ళ కల్లు తెరిపంచమని ఏడుకుంటున్నాను. నమస్కారం సామీ. వత్తాను మరి... పెచారం కోసం బోల్డు ఊర్లు తిరగాలి' అంటూ గుడి బయటకు వచ్చాడు

అదండీ వరస... వరసగా కోడలు మీద పోటీ చేసే అత్తగారు, అత్తగారి మీద పోటీ చేస్తున్న అల్లుడు, అన్న మీద పోటీ చేసే తమ్ముడు, తమ్ముడి మీద పోటీ చేసే అక్కగారు, బావాబామ్మర్థుల, తోడికోడళ్ళు, తోడళ్లుళ్లు.... అభ్యర్థులందరూ వస్తూనే ఉన్నారు. తమ కోర్కెల్ని భగవంతుడికి మనసువిప్పి చెప్పుకుంటున్నారు. ఎవరికివారే తమనే నెగ్గించమని ప్రాధేయపడుతున్నారు, వేడుకుంటున్నారు. నెగ్గిస్తాడనే నమ్మకంతో ప్రచార రంగంలోకి దుముకుతున్నారు. తమ తమ వాగ్ధానాలతో ఓటర్లను ముంచెత్తుతున్నారు. అవి నమ్మని వాళ్ళ మీద కాసుల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని చోట్ల కానుకల మెరుపులు మెరిపిస్తున్నారు. అవేవీ పని కావన్పిస్తే సారా ఏరుల్ని పారిస్తున్నారు. ఎన్నికల సీజన్ పండగలా సాగిపోతోంది సామాన్య ఓటరుకి. ఎవరికి వారే తమ తమ కోర్కెల్ని విన్నవించుకుంటున్న అభ్యర్థుల్ని చూసి గుడిలోని స్వామివారికి ఎవరికి విజయాన్ని చేకూర్చాలా అన్న సంశయం ఏర్పడంది. ఏ అభ్యర్థిని గెలిపించినా మరొక అభ్యర్థికి అన్యాయం చేసినట్లవుతుంది. కానీ విజయం ఏ ఒక్కరినో మాత్రమే వరించాలి. ఈ ధర్మసంకోచాన్ని ఎలా పరిష్కరించాలబ్బా... అనుకుంటూ డైలమాలో పడిపోయిన స్వామికి సడెన్ గా స్ఫురణకొచ్చాడో అతి ముఖ్యమైన వ్యక్తి. అభ్యర్థుల జయాపజయాలకు కారణభూతుడయ్యే వ్యక్తి అతనే... ఓటరు మహాశయుడు! 'అవునూ... ఓటర్లు ఏదో క పార్టీని సపోర్టు చేస్తూ వుండాలే... మరి ఏ ఒక్క ఓటరూ వచ్చి తమ పార్టీని గెలిపించమంటూ మొక్కుకోడేం' అన్న అనుమానమూ వచ్చింది స్వామికి. 'అయినా అది కూడా ఇబ్బందికరమే. ఓటర్లందరూ ఒక్కపార్టీనే బలపరచరు కదా...' అనుకున్నారు స్వామి. అలా స్వామి ఆలోచనల్తో సతమతమవుతూ ఉండగానే... చేతిలో ఓ చీప్ లిక్కర్ సీసా పట్టుకొని కాస్త తూలుతూ లోపలికి వచ్చాడు ఓ సామాన్య మానవుడు. 'హమ్మయ్య...'అని ఊపిరి పీల్చుకున్నాడు గుడిలోని స్వామి. 'ఇతడి కోరిక ఏమిటో తెల్సుకొని... అప్పుడు ఎవర్ని నెగ్గించాలో ఆలోచించవచ్చులే' అనుకున్నాడు స్వామి. అసామాన్యులకే కాని, సామాన్యులకి అంతరాలయంలోకి ప్రవేశం లేదని చెప్పకనే చెప్తున్నట్టుగా తలుపులు మూసుకొని వెళ్ళిపోయాడు అప్పటికే అర్చకస్వామి. 'ఇంకా నయం... తలుపులకి కటకటాలైనా ఉన్నాయి' అనుకుంటూ అనుకుంటూ లోపలికి చూశాడు ఆ సామాన్య ఓటరు. ఎక్కడో లోపల నిర్వికారంగా నిలుచుని ఉన్నాడు స్వామి. నూనె దీపపు వెలుగులో ఆయన ధరించిన నగలు తళుక్కుమని మెరుస్తున్నాయి... 'నమస్కారం సామీ...' అంటూ చేతులు జోడించబోయాడు. చేతిలో చీప్ లిక్కర్ బాటిలు అడ్డొచ్చింది. 'చెమించుసామీ...' అంటూ దాన్ని జేబులోకి తోసి, రెండు చేతులూ కలిపి నమస్కారం చేయబోగా ముందుకు తూలి పడబోయాడు. కటకటాల్ని ఆనుకొని పడిపోకుండా ఆపుకున్నాడు. 'మరోపాలి సెమించాలి సామీ! ఏం లేదు సామీ... ఓ సిన్న కోరిక మీకు యినిపించేసి ఎల్లిపోదామని వచ్చేను సామీ. ఈ ఎలచ్చన్లలో ఏ పార్టీకి మెజారిటీ రాకుండా సెయ్యిసామీ. అంతే... వత్తాను సామీ గుడ్..గుడ్...బై సామీ' అంటూ వెనుదిరగబోయాడు ఆ సామాన్య ఓటరు. టేబులో పెట్టిన చీప్ లిక్కర్ బాట్లిని చేత్తో తడుముకుంటూ... ఒక్కసారిగా షాక్ తిన్నవాడిలా కదిలిపోయాడు ఆ సామాన్య ఓటరు. కారణం...?

ఎక్కడో అంతరాలయంలో శిలారూపంలో నిలబడి ఉండే సామి మిరుమిట్లు గొలిపే కాంతులతో అతని ఎదురుగా నిజరూపంతో ప్రత్యక్షం కావడమే! 'అయ్యబాబోయ్... అయ్యోరు... మీరు నిజంగానే ప్రత్యక్షమయ్యారా... ఏమి నాభాగ్యం' అంటూ చెంపలు వాయించుకుంటూ దండాలు పెట్టేస్తున్నాడు ఆ సామాన్య ఓటరు. 'నాయనా! కంగారు పడకు. ఇలా నీకు నేను కనపడడానికి కారణం. నువ్వు కోరుతున్న కోరికే...' అన్నారు స్వామి. 'అయ్యబాబోయ్. నేనేమన్నా తప్పుడు కోరిక కోరానా అయ్యోరు? క్షమించండి సామీ...' అంటూ మరోసారి కంగారు పడిపోయాడా సామాన్య ఓటరు. 'అది కాదోయ్... నువ్వు ఏ పార్టీకి మెజార్టీ రాకూడదని కోరుకున్నావే... అదే నాకాశ్చర్యాన్ని, అనుమానాన్ని కల్గించింది. అది నివృత్తి చేసుకోవడానికే ఇలా నీ ముందుకు వచ్చాను. ఇంతకీ నీవలా ఎందుకు కోరుకున్నావు' అడిగాడు స్వామి. అదా అయ్యోరూ? ఏం సెప్పమంటారు సామీ మా పాట్లు... పెద్ద మెజారిటీతో నెగ్గిస్తే మా సె

Share by EmailComments

Lore

[email protected]

This is crtasyl clear. Thanks for taking the time! http://ngwxtphln.com [url=http://fgfnvyuem.com]fgfnvyuem[/url] [link=http://wikldsahztc.com]wikldsahztc[/link]


Kaylyn

[email protected]

Your posting is abtulosely on the point!


Christina

[email protected]

Super jazzed about getting that knwowh-o. http://qardfsqxck.com [url=http://phiuumyfszo.com]phiuumyfszo[/url] [link=http://dsjcngxqmgr.com]dsjcngxqmgr[/link]


Vicky

[email protected]

So much info in so few words. Totolsy could learn a lot.


Rileigh

[email protected]

The puascrhes I make are entirely based on these articles.


Your comments
Can't read the txt? click here to refresh.