Articles - Poetry Of Life




Name: Admin

Published Date: 05-04-2016


పొయెట్రీ ఆఫ్ లైఫ్

(Miss vijayalakshmi) మా వాడికి అదో రకమైన జబ్బు చేసింది. అఫ్ కోర్స్! ఇదే రకమైన జబ్బు ఆయనెవరో రాజకీయ నాయకుడికి కూడా ఉండేదట. రాజకీయ నాయకుడికీ జబ్బున్నా పెద్ద ప్రమాదమేం లేదు. పేపర్లు ఘనంగా ఆ విషయం ప్రచారం చేసి, ఆ తరవాత నోళ్లు మూసుకున్నాయి. రాజకీయ నాయకుడి విషయంలోనైతే అదో సరదాగానూ విడ్డూరంగానూ చెప్పుకుని ప్రజలు నవ్వుకున్నారు. కాని మా వాడి విషయంలో అలా కాదే?! వీడింకా ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు. ఎమ్.ఎ. ఫస్టు క్లాసులో పాసైన వాడు. నిరుద్యోగి. ఇంకా పెళ్లి కాలేదు. ఈ జబ్బు విషయం తెలిస్తే, ఇంక వీడికెవరైనా పిల్లనిస్తారా?! వీడి మగతనంలో ఏదో లోపముందని నలుగురూ ఆడిపోసుకోరూ?? అసలే ఆఫీసు పనుల్లో ఉక్కిరి బిక్కిరిగా తలమునకలై ఛస్తూంటే, ఇదో కొత్త సమస్య వచ్చిపడింది. ఏం చెయ్యటానికీ పాలు పోవటల్లేదు. రాత్రి నా శ్రీమతి చెప్పింది- 'ఏమండీ! వీడి జబ్బు రాను రానూ ముదిరిపోతోందండీ! ఎప్పుడెలా ప్రవర్తిస్తాడో తెలీకుండా ఉంది. ఇంత కాలం లంగాలు కట్టుకోవడం, చీరెలు చుట్టబెట్టుకోవడంతో సరిపెట్టుకునే వాడు. నిన్న రాత్రి ఒక చెవికి జుంకా తగిలించుకుని పెదాలకు లిప్ స్టిక్ పూసుకుని పడుకున్నాడు.. ఎవరికైనా ఈ విషయం తెలీక ముందే ఏదో ఒకటి చెయ్యాలి.' 'రేప్పొద్దున్న నాకాఫీసులో ఇన్ స్పెక్షన్ ఉంది. నువ్వే ఎలాగో వాడికి నచ్చజెప్పి డాక్టరు దగ్గరకి తీసికెళ్లు ' అన్నాను. 'రేపు మంగళవారం కదండీ. మనూరి భూత వైద్యుడికి చూపించనా అంది శ్రీమతి. నాకు ఛిర్రెత్తుకొచ్చింది. 'నా బొంద. భూత వైద్యుడి దగ్గరకి నిన్నెవడు తీసికెళ్లమన్నాడే? మన ఫ్యామిలీ డాక్టరు దగ్గరకి తీసికెళ్లు' అన్నాను. మర్నాడు మా వాడ్ని ఆస్పత్రికి తీసికెళ్లినట్టుంది నా భార్య. ఆ రాత్రి ఎంతో ఆనందంగా గుసగుసలుగా నా చెవిలో చెప్పింది- 'ఏవండీ! మనవాడి మగతనంలో ఏ లోపం లేదుటండీ. వాడికి అసలే రోగం లేదుట. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాట్టండీ' అని. నా మనసుకు కొంత ఊరట కలిగినా సందేహంగా అడిగాను- 'మరైతే వాడెందుకలా ప్రవర్తిస్తున్నాడంటావు?' అని. 'ఒకవేళ ఎవరైనా చేతబడి చేశారేమోనని నాకనుమానంగా ఉందండీ' అంది. 'ఛ నోర్ముయ్!'అన్నాను కోపంగా నేను. 'మీరలాగే అంటారు. చేతబడులూ ఉన్నాయి- బాణా మతులూ ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇదేదో ఇటువంటి బాపతే అనే అనుమానం నాకుంది. ఎందుకైనా మంచిది ఒకసారి ఎవర్నైనా పెద్ద మంత్రగాడ్ని పిలిపిద్దాం. ఏమంటారు?' అంది నా శ్రీమతి. 'ట్రాష్! అలాంటివేవీ ఉండవని నువ్వు పేపర్లో చదవడం లేదా?' అన్నాను విసుగ్గా. 'అయితే ఇదంతా మన గ్రహచారం అనుకోవాల్సుంటుంది. పోనీ ఓ పని చేద్దామండీ! ఓ పెద్ద పురోహితుడ్ని పిలిపించి నవగ్రహ జపం చేయిద్దామండీ! ఆ తరవాత అబ్బాయి చేత నవగ్రహ దానాలిప్పించి శాంతి జరిపిద్దామండీ' అంది. 'అనడానికేముందిలేవే? వేరే తిరుపతికెళ్లక్కర్లేదు. ఇక్కడే మనకా పురోహితుడు కూచోబెట్టి నున్నగా క్షవర కళ్యాణం చేసేస్తాడు అన్నాను చిరాగ్గా.ఏవండోయ్! తిరుపతంటే గుర్తొచ్చిందండీ! ఆ వెంకన్న బాబుకు ఏనాడో మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చకపోబట్టే ఇలాగై ఉంటుంది. అందుకే మనం వెంటనే బయల్దేరి తిరుపతికెళ్లి మొక్కు తీర్చుకొచ్చేద్దామండీ' అంది. 'అబ్బబ్బ నీ మూఢనమ్మకాల్తో అడ్డమైన మొక్కులూ మొక్కి నా ప్రాణం తోడేస్తున్నావు' అన్నాను అసహనంగా. 'అపచారం! అపచారం!' అంటూ నా భార్య చెంపలేసుకుంటే నాకు నవ్వొచ్చింది. నవ్వుతూ అడిగాను- 'అది సరే! డాక్టరు మనవాడికే జబ్బు లేదన్నాడన్నావు కదా? మరైతే వాడెందుకిలా ప్రవర్తిస్తున్నాడో కనుక్కో లేదా?' 'కనుక్కున్నానండీ. ఆయనేమిటో చెప్పారు. అదేనండీ. ఓ సారి సైకియాట్రిస్టు ఎవరికైనా చూపించమన్నాడు.' సైకియాట్రిస్టు అనగానే నా గుండె గుభేలుమంది. అయితే నా కొడుక్కి 'పిచ్చా?!' ఎక్కడ లేని భయం పట్టుకుంది. అప్పుడెప్పుడో మా అత్తయ్యకి పిచ్చెక్కిందన్నారు. ఆ తరవాత అది హిస్టీరియా అని తేల్చారు. సర్లే! 'ఏదో ఒకటి' అని గుండె దిటవు చేసుకున్నాను. డబ్బు క్షవరానికే ఇలాటివన్నీ వస్తాయి. డబ్బు పోతే జబ్బు తగ్గుతుంది. నిజానికి నాక్కూడా చాలా మందిలా సైకియాట్రిస్టును కలవడమంటే చచ్చేటంత భయం. ఎందుకంటే వాడు నాకూ ఏదో పిచ్చి ఉందంటే చావాలి. అందుకే ఊళ్లో ఓ పేరున్న సైకియాట్రిస్టు అడ్రసు చెప్పి, నా శ్రీమతినే అబ్బాయిని తీసుకుని వెళ్లి కలవమన్నాను. రెండ్రోజుల తర్వాత నా శ్రీమతి మా వాడ్ని తీసుకుని సైకియాట్రిస్టుని కలిసొచ్చినట్లుంది. 'ఏవండీ ఆ సైకియాట్రిస్టు నన్ను బయట కూచోబెట్టి, మన అబ్బాయిని తన ప్రయివేటు రూమ్‌లోకి తీసికెళ్లి మూడు నాలుగ్గంటలు పరీక్ష చేసి, మిమ్మల్నో సారి ఆయన దగ్గరకు పంపమన్నారండీ' అంది. అలాటి తప్పనిసరి పరిస్థితిలో నేను వెళ్లి ఆ సైకియాట్రిస్టును కలిశాను. 'మీకేం భయం లేదండీ. తప్పకుండా మీ అబ్బాయికి జబ్బు నయమౌతుంది. మీ అబ్బాయి అసలిలా మారడానికి కారణం మీ తల్లిదండ్రులే!' అన్నాడు సైకియాట్రిస్టు. నేనాశ్చర్యపోయాను. 'మా అబ్బాయి అలా మారడానికి కారణం మేమా' అని. 'అదేమిటి డాక్టరు గారూ? మా వాడికే లోటూ రాకుండా మేము చూసుకుంటున్నామే? వాడికి పాంట్లూ షర్టులే కాకుండా సూట్లు కూడా కుట్టించానే? అదేం ఖర్మమో మగాళ్ల బట్టలేసుకోకుండా ఆడవారి బట్టలు కట్టుకోడమేమిటండీ? ఎవరైనా చూస్తే నా పరువేంగాను? వాడికసలు పెళ్లవుతుందా? తృతీయ ప్రకృతి వాడనుకోరూ?' అన్నాను. సైకియాట్రిస్టు నా మాటలకు చిన్నగా నవ్వాడు. 'అసలు ప్రతి జీవిలోనూ 'ఆడా-మగా' లక్షణాలు రెండూ కలగాపులగంగా ఉంటాయి. అయితే, ఆ రెండూ సమపాళ్లల్లో ఉంటా ఏ బాధా ఉండదు. ఇది మనస్సుకు సంబంధించినదే సుమండీ! మానసిక స్థితిలో ఏ మాత్రం తేడా వచ్చినా ఇలా విపరీత పోకడలు పోతాడు మనిషి'. ఇలా ఆయన చెప్పి, నన్ను ఆయన తన ప్రయివేట్ రూమ్‌లోకి తీసికెళ్లి నన్ను కూచోమని ఒక సి.డి డిస్కు తెచ్చి, దాన్ని ప్లేయర్ లో పెట్టి ఆన్ చేశాడు. నాకు మావాడి మాటలూ - డాక్టరు గారి మాటలూ ఒకదాని తరవాత ఒకటిగా స్పష్టంగా వినిపిస్తున్నాయి. 'ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో గాని డాక్టరుగారూ! నేనీ జన్మలో మగ పుటక పుట్టి నా పుట్టి ముంచుకున్నాను.' 'అదేమిటి సోమూ! అలాగంటావు? ప్రతివాళ్లూ మగాడిగా పుట్టాలనుకుంటారు. తల్లిదండ్రులు కూడా కొడుక్కిచ్చే ప్రాధాన్యతని కూతురుకివ్వరుగదా? కొడుకు పుడతాడంటేనే ఆనందం కదా?' 'అవునవును. కొడుకు పుడితే ఆనందిస్తారు. ఎందుకో తెలుసా? వాడి చేత గానుగెద్దులా పనులు చేయించుకోవడానికి. అందరి విషయంలో అయితే ఏమో గాని, నా విషయంలో మాత్రం నేను జన్మ జన్మలా ఆడ పుటకనే కోరుకుంటాను. ఇంచక్కా ఆడదైతే, చదూకున్నా ఫరవాలేదు - చదూకోకపోయినా ఫరవాలేదు. బోలెడు కట్నమిచ్చి చక్కని సంబంధం చూసి పెళ్లి చేస్తారు. ఆ తరవాత పతిదేవుడ్ని క్రీగంటి చూపులతో మత్తెక్కించి కనుసన్నల్లో బతికేలా చేసుకోవచ్చు. ఆ పైన వడ్డించిన విస్తరిలా జీవితాన్ని గడిపేయచ్చు' 'సోమూ! నువ్వు పొరబడుతున్నావు. నువ్వు ఆడదానిగా పుట్టావనుకో, అప్పుడు నీ తల్లిదండ్రులు బీదవాళ్లై, హెచ్చు కట్నమిచ్చి పెళ్లి చెయ్యలేకపోతే అప్పుడు నీ బతుకేమవుతుంది?' 'ఏమీకాదు. అప్పుడూ బాగానే ఉంటుంది. గంతకు తగిన బొంతను ఎవరినో ఒకరిని చూడకపోరు. ఒకవేళ వాళ్లు చూడకపోయినా నాకేం భయం లేదు. డబ్బూ - హోదా ఉన్నవాడినెవడినో చూసి, ప్రేమించినట్లు నటించి వల్లో వేసుకుంటాను. ఆ తరవాత వాడ్ని పెళ్లాడి జీవితం ధన్యం చేసుకుంటాను.' 'నువ్వన్నట్లుగా జరక్క ఆ డబ్బున్నవాడు కూడా నిన్ను ప్రేమించినట్టు నటించి, నిన్ను మోసం చేస్తే?' 'అలా ఎన్నటికీ జరగదు. అలాగే కనక జరిగితే, నేను మరో బిట్నీ స్పీయర్స్ గానో పమెల్లాగానో తయారై చరిత్ర సృష్టిస్తాను. క్రిస్టిన్ కీలర్ మార్లిన్ మన్రోల్లా ఎందరో పురుషుల్ని నా పాదాక్రాంతుల్ని చేసుకుని డబ్బుకు డబ్బూ పేరుకి పేరూ సంపాదిస్తా.' 'సోమూ అందం శాశ్వతం కాదు. ముసలితనం వస్తుంది అప్పుడేం చేస్తావు?' 'అప్పటికి నేను నా జీవితాన్ని పూర్తిగా అనుభవించటం అయిపోతుందిగా!' 'నీ ఆలోచన బానే ఉంది. కాని అది నువ్వు అందంగా పుట్టినప్పటి మాట కదా? నువ్వు అనాకారిగా పుడితే ఏం చేస్తావు?' 'భలే చెప్పారు డాక్టర్! ఈ రోజుల్లో అందం ఎవరు చూస్తున్నారు? ఎంతమంది అనాకారి స్త్రీలు మేకప్పులు చేసుకుని, అంగాంగ ప్రదర్శనలు చేస్తూ సినిమాల్లో ప్రముఖ తారలై, పురుష ప్రేక్షకుల చేత చొంగలు కార్పించటల్లేదు? నేటి సమాజంలో అందం కన్నా స్త్రీత్వానికే ప్రాముఖ్యతుంది.' 'సినిమాల్లో నీకు ఛాన్సు దొరకాలిగా?' 'అప్పుడు బాగా చదువుకుని ఆడవాళ్ల రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం సంపాదిస్తా.' 'ఇప్పుడైతే మాత్రం? నీకో మంచి ఇద్యోగం వచ్చిందనుకో. అపుడు నువ్వు మీసం మెలేసి, 'నేను మగాడినీ అని ధైర్యంగా చెప్పుకుని, ఓ అందమైన అమ్మాయి మెళ్లో తాళి కట్టి సుఖపడవా?' 'అంతటదృష్టం నాకు లేదు డాక్టర్! మగాడిగా పుట్టినందుకు చిన్నప్పట్నించీ నేననుభవించిన బాధలు ఇన్నీ అన్నీ కావు.' 'ఏమిటా బాధలు?''ఒరే సోమూ! మగాడివి కాదట్రా? నాయన్నాయనా! నేను గుళ్లోకెళ్లాలి. కొంచెం చెట్టెక్కి నాలుగు కొబ్బరికాయలు దింపరా. చచ్చి నీ కడుపున పుడతాను' అంతుంది బామ్మ. 'ఒరే సోమూ అసలే నీరసంతో చచ్చిపోతున్నాన్రా! తల్లికి ఆ మాత్రం సాయం చేస్తే తప్పేంలేదు. రేప్పొద్దున్న పెళ్లయ్యాక నీ లాటి వెధవాయలే పెళ్లానికి ఇల్లూడ్చి, కూరలు తరిగి, వంటలు కూడా చేసిపెడతారు. నేను చెప్పేది ఏమంత కష్టమైన పనని? మగాడివి కాదూ? పది బకెట్ల నీళ్లు తోడిపెడితే అరిగిపోతావా కరిగిపోతావా?' అంటుంది అమ్మ. 'ఒరే సోమూ! సిగ్గు లేదురా? మగాడివి కాదురా? ఆడదిగా పుట్టిన నీ చెల్లాయి కన్నా, నీకు లెక్కల్లో నాలుగు మార్కులు తక్కువొచ్చాయంటే నువ్వెందులోనైనా దూకి చావాలిరా! సర్లె ముందు బజారుకెళ్లి కూరలు పట్రా' అంటాడు నాన్న.' 'నువ్విలా నన్ను కూరలకీ వాటికీ బజార్లంట తిప్పుతుంటే నేను రేపు పరీక్ష ఫెయిలయ్యి ఇంట్లో కూర్చుంటాను' అని నేనంటే, 'నోర్ముయ్యరా వెధవా! మగాడివై పుట్టాక బజారు పన్లు నువ్వు చెయ్యకుంటే, చెల్లాయెళ్లి చేస్తుందనుకుంటున్నావా? మగాడన్నాక అన్నింట్లోనూ ఉండాలి. మా కాలంలో మేము చదువుకునే రోజుల్లో మేము ఆటల్లో ఫస్టు. బజారు పనులు చెయ్యటంలో ఫస్టు. ఈ కాలం కుర్రాళ్లు మీరూ ఉన్నారు. ఎందుకూ పనికిరాని ఆడంగి వెధవల్లా తయారయ్యారు' అనే వాడు నాన్న. అప్పుడు నేను 'అవును. మగాడిగా పుట్టినందుకే గదా నాకీ శిక్ష! అదే ఆడదాన్నై పుట్టుంటే మీరు నన్నిలా చంపుకు తినేవారా?'అనేవాడిని.దానితో మా నాన్న- 'అవున్రా! అసలు నువ్వు ఆడదై పుట్టి, నీ చెల్లాయి మగాడై పుట్టుంటే మాకీ బాధలుండేవి కావురా. నోరు మూసుకుని మగాడిగా పుట్టినందుకు చెప్పిన పన్లు చెయ్యి' అనే వాడు నాన్న. 'ఇంక మా చెల్లి - 'అయ్యో మర్చేపోయాన్రా అన్నయ్యా! ఇందాకే నువ్వు బజారెళ్లి వచ్చావా?! ఒరే, టైలరు దగ్గరకెళ్లి నా లంగాలు కుట్టాడేమో అడిగి తెచ్చెయ్యరా' చచ్చీ చెడీ నేను బజారెళ్లి లంగాలు తెస్తే, వాటిల్లో ఏవో లోపాలు చూపించి, సైజు చేయించుకు రమ్మని పంపేది. ఇలా బజార్నించొచ్చానో లేదో - మళ్లీ 'ఒరేయ్! అన్నాయ్! ఇంట్లో ఉందనే అనుకున్నాన్రా. సూది ఎంత వెతికినా కనిపించి చావలేదు. కొంచెం తెచ్చిపెట్టరా. చీరకి ఫాల్ కుట్టుకోవాలి' అనేది. అందరూ అన్నీ ఒకేసారి చెప్పరు. ఇంటి నించి రెండు మైళ్ల దూరంలో ఉన్న బజారుకు పదే పదే పంపుతారు. అంతే కాదు ఇంటికొచ్చిన చుట్టాలు కూడా క్షణక్షణానికీ 'మగాడు' అని గుర్తుచేస్తూ అడ్డమైన పనులూ చేయించుకునే వారు.'అందులో తప్పేముంది? నువ్వు మగాడివేగా! పైగా, నువ్వు చేస్తున్న పన్లు ఎవరో పరాయివాళ్లకు చేస్తున్నట్టు మాటాడతావేంటి? నీ సొంత తల్లిదండ్రులకీ - నీ చెల్లాయికేగా నువ్వు సాయం చేసేది.' 'సర్లెండి మీరలాగే చెబుతారు. అసలీ ఆడవాళ్లు మగాళ్లతో సమానంగా హక్కులు కావాలంటారే? ఆ మాత్రం బజారుకెళ్లి తమ పన్లను తాము చేసుకోలేరా? సినిమాలకీ షికార్లకీ తయారవమంటే తగుదునమ్మా అని తయారవుతారు. అదే బట్టలు కొనుక్కోమంటే.. మగాళ్లకి చీరెల సెలెక్షన్ తెలియదంటూ అన్ని బట్టల కొట్లూ చుట్టబెడతారు. కాలేజీలకెడతారు. ఉద్యోగాల్లో చేరి జీతాలు తీసుకుంటారు. తామేదో కష్టపడిపోతున్నట్టు నటించి గారాలు గుడుస్తూ, వయారాలు పోతూ మగాళ్లని వేపుకు తింటారు. కాల్ గ్యాసూ, గ్రైండర్లూ, ప్రెషర్ కుక్కర్లూ వచ్చాక ఏమిటండీ ఈ ఆడవాళ్లు కష్టపడిపోతున్నది? ఇప్పుడు మా చెల్లినే చూడండి - ఆడవాళ్ల రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం సంపాదించుకుంది. మా నాన్న ఇచ్చిన లక్షల కట్నంతో ఇంజనీరును పెళ్లి చేసుకుంది. నగా-నట్రా, ఖరీదైన పట్టుచీరెలూ పట్టికెళ్లి సుఖంగా కాపురం చేస్తోంది. చెల్లిలా నేనూ ఆడదాన్నై పుట్టి ఉంటే, మా అమ్మా నాన్నా నాక్కూడా అలాటి సౌఖ్యాలు అమర్చిపెట్టే వారు కాదా? ఆఖరికి నాకేమనిపిస్తోందో చెప్పనా డాక్టర్ - 'ఎవరైనా ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటే చాలునని. అప్పుడు నేనా అమ్మాయికి ఇంటి పనుల్లోనూ, వంట పనుల్లోనూ సాయం చేస్తూ - 'ఆడ భర్త 'గా బతికేస్తాను. ప్చ్! ఏం లాభం? ఈ ఆడ వాళ్లున్నారు చూశారూ? వాళ్లు దానిక్కూడా ఒప్పుకోరే? మగాడితో సమానంగా స్వతంత్రం హక్కులూ కోరుకునే ఈ ఆడవాళ్లు ఉద్యోగం సద్యోగం లేని నా లాటి వాడ్ని పెళ్లాడ్డానికి ఒప్పుకోరే!? మిగతా మగవాళ్లెలా ఉన్నా తన భర్త మాత్రం తనకన్నా ఎక్కువ చదువుకున్న వాడు, పెద్ద ఉద్యోగం చేస్తూ పై హోదాలో ఉన్న వాడూ కావాలని కోరుకుంటారు.' సైకియాట్రిస్ట్ సిడి ప్లేయర్ ని ఆపుచేశాడు. 'అందుకే మగపిల్లల్నీ ఆడపిల్లల్నీ సమానంగా చూడాలి. వాళ్లల్లో తమని ఏదో తేడాగా చూస్తున్నట్టు అనిపించకూడదు. మాటిమాటికీ 'నువ్వు మగ - నువ్వు ఆడ ' అని గుర్తు చేస్తూ పెంచకూడదు. ఇప్పటికైనా అర్థమైందాండీ రావుగారూ?' నా మెదడులో ఇంకా మా వాడి మాటలే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. భయం భయంగా అడిగాను- 'డాక్టరు గారూ ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు? వాడు మళ్లీ మనలోకొస్తాడంటారా?' 'రావĹ

Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.