Articles - Pe Pall
Name: Admin

Published Date: 06-04-2016


పే పాల్

                         - కె.వి.గిరిధరరావు ఆ రోజు రాత్రి డిన్నర్ చేసేటప్పుడు 'త్వరలో మా కంపెనీ ఇంకొంతమంది జనాలని పీకేస్తుందట' చెప్పాడు సురేష్ భార్యతో. 'మళ్ళీనా... రెణ్ణెళ్ల క్రితమేగా కొందరిని తీసేసారన్నారు' అంది సుజాత ఆశ్చర్యంగా. 'అవును... ఇది ఇంకో రౌండు' చెప్పాడు సురేష్. 'ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోనని బిక్కుబిక్కుమనుకుంటూ ఇక్కడే వ్రేళ్ళాడే బదులు, నా మాట విని ఇండియా వెళదాం పదండి' అంది సుజాత, రసం పోసుకుంటూ. సురేష్ ఏమీ మాట్లాడలేదు. 'ఈ ఉద్యోగం పోతే మరొకటి దొరకడం కష్టమంటున్నారు కదా. ఏదో అయిదేళ్ళపాటు ఇక్కడ ఉన్నాం. ఈ దేశాన్ని చూశాం. కాస్తో కూస్తో కూడబెట్టుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ మంచి ఉద్యోగమే దొరుకుతుందంటున్నారు కదా! అక్కడైతే ఉన్న డబ్బుతో ఇల్లు కొనుక్కొని, మిగిలింది బేంకులో వేసుకుని... ఉద్యోగం ఉంటుందా... ఊడుతుందా అన్న టెన్షన్ లేకుండా బతకొచ్చు' పాత పాటే మళ్ళీ పాడింది సుజాత. 'మన దగ్గరున్న సేవింగ్స్ కు హైదరాబాద్ లో అపార్ట్ మెంటొస్తే గొప్ప...' అన్నాడు సురేష్. గత నాలుగైదేళ్ళలో హైదరాబాద్ రియలెస్టేట్ రేట్లూ ఆకాశన్నంటాయి. కాస్టాఫ్ లివింగ్ బాగా పెరిగింది. 'స్టాకుల్లో అంతా హారతి కర్పూరం చెయ్యబట్టే కదా సేవింగ్స్ కు చిల్లి పడింది. మీ నిర్వాకాలన్నీ అంతే' అంది సుజాత. సుజాత గొంతు ననుకరిస్తూ 'స్టాకుల్లో వాళ్ళంత సంపాయించారు.... వీళ్ళింత సంపాదిస్తున్నారు అని చేతులు తిప్పుతూ నువ్వే కదా నన్ను ఎగదోసింది... ఏదో ఎకానమీ సడన్ గా పడిపోబట్టి లాసొచ్చింది. మళ్ళీ ఇప్పుడు స్టాకులు పెరుగుతున్నాయి కొందామంటే నువ్వేగా వద్దని ఆపుతున్నావ్' ఉక్రోషంగా అన్నాడు సురేష్. 'లాభమొస్తే మీ ప్రతిభ... నష్టమొస్తే నా వల్ల. చేసిందంతా చేసి అంతా నా మీదకు నెడతావేం?' అంది సుజాత. ఫోను రింగ్ కాకపోతే ఇంకాసేపు గొడవ పడేవాళ్ళే. 'మీకే..' ఫోనందించి, ప్లేటు తీసుకుని సింక్ దగ్గరకెళ్ళింది సుజాత. ఒక నిమిషం మాట్లాడాక తింటున్న ప్లేటును డైనింగ్ టేబుల్ దగ్గరే వదిలేసి, బెడ్ రూమ్ లోకెళ్ళాడు సురేష్. ఫోనులో సురేష్ అరుస్తున్నట్లు అనిపించి, అటువైపు వెళ్ళింది సుజాత. అప్పటికే ఫోను పెట్టేసి, బెడ్ రూములో ఒక మూలన ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని కనిపించాడు సురేష్. 'ఏమైంది?' అడిగింది సుజాత
'అబ్బే ఏమీ లేదు. చిన్న బిల్లింగ్ ప్రోబ్లెం' అంటూ బలవంతాన నవ్వాడు. 'క్రెడిట్ కార్డుదా?' అడిగింది భర్తను గమనిస్తూ. ఏదో ఒకటి చెప్పకపోతే వొదలదని 'అవును క్రెడిట్ కార్డుదే' అన్నాడు 'ఏ క్రెడిట్ కార్డు?' అడిగిందీ మళ్ళీ. అసహనాన్ని అణచుకుంటూ 'వీసా కార్డు' చెప్పాడు గట్టిగా, గొంతులో కోపాన్ని, విసుగునూ ధ్వనిస్తూ. 'ఏ వీసా కార్డు...బేంకాఫ్ అమెరికాదా?' అడిగింది మళ్ళీ. 'ఏదైతే నీకెందుకు? వెళ్లి అంట్లు తోముకోక?' అరిచాడు గట్టిగా. దాంతో ఇదేదో చిన్న బల్లింగ్ మిస్టేక్ వ్యవహారం కాదని తేలింది సుజాతకు. మాట్లాడకుండా గదిలోంచి బయటికొచ్చి టీవీ ముందు కూర్చుంది. స్టాకుల్లో దెబ్బ తిన్నప్పటి నుంచీ, డబ్బు వ్యవహారాల్లో మొగుణ్ణి ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఈ మధ్య ఎక్కువగా కంప్యూటర్ దగ్గర కూర్చుంటున్నాడు. కొంపదీసి ఆన్ లైన్ గేంబ్లింగ్ ఆడి ఉన్న సేవింగ్స్ ను కులికించాడా అన్న అనుమానమొచ్చింది. కోపంగా ఉన్నాడు కాబట్టి, ఇప్పటికి వదిలేసి వ్యవహారం రేపు తేల్చుకోవచ్చనుకుంది. పక్కమీద కళ్ళు మూసుకుని పడుకున్నాడన్న మాటేగానీ అస్సలు నిద్ర పట్టలేదు సురేష్ కు. 0-0-0 'పే పాల్ కంపెనీవాళ్ళు ఫోనులో చెప్పిన విషయాలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. తలచుకుంటే అంతా కలలా ఉంది. నెల క్రితం 'తుమ్మితే వూడే ముక్కులాంటి ఉద్యోగంతో ఎన్నాళ్ళిలా బతుకునీడ్చడం?! డబ్బు సంపాదించడానికి ఇంకేమీ మార్గాలు లేవా?' అని తీవ్రంగా ఆలోచిస్తున్న తరుణంలో... 'ఇంటి నుంచి పని చేయండి' అని ఒక ఇ-మెయిల్ వొచ్చింది. రెండు పేజీల ఈ మెయిల్ ను చాలా ఓపిగ్గా చదివాడు సురేష్. 'కంప్యూటరూ, ఇంటర్నెట్ కనెక్షనూ ఉంటే చాలు మరే పెట్టబడి, అనుభవం అవసరం లేదు.... కాలేజి డిగ్రీ ఉన్నాలేకున్నా ఫరవాలేదు.... మీకు మేరే బాసు. పార్టు టైము చెయ్యొచ్చు, ఫుల్ టైము చెయ్యొచ్చు... కుదరకపోతే మీకు ఖాళీ ఉన్నప్పుడు చెయ్యొచ్చు. పూర్తి వివరాలకు ఈ మెయిలుతో సంప్రదించండి.' చాలా ఆకర్షణీయంగా కనిపించింది. 'ఆలస్యం అమృతం విషం' అనుకుంటూ వెంటనే వివరాల కోసం ఈమెయిలు పంపాడు.

రెండు గంటల్లో రిప్లయి వొచ్చింది 'నా పేరు విలియం ఫాక్స్. నేను జెకస్లోవేకియాలోని లెస్ క్రైమ్ సాఫ్ట్ ఇంక్ అనే కంపెనీకి ప్రతినిధిని. మా కంపెనీ కంప్యూటర్ నేరాలను నివారించే సాఫ్ట్వేర్ ను తయారు చేస్తుంది. మాకు అన్ని దేశాలలో కస్టమర్లు ఉన్నారు.... ముఖ్యంగా ఉత్తర అమెరికా కస్టమర్లు మా సాఫ్ట్వేర్ కొన్నప్పుడు సాధారణంగా డబ్బును క్రెడిట్ కార్డుతో చెల్లిస్తారు. కాబట్టి మాకు 'పే పాల్' సాఫ్ట్వేర్ ను ఉపయోగించడంలో అనుభవమున్న వారు కావాలి. చట్టపరమైన కొన్ని నిభందనల వల్ల మా దేశంలో పేపాల్ ఉపయోగించడానికి అనుమతి లేదు. కాబట్టి జెకస్లోవేకియా బయట నివసిస్తూ, కష్టమర్ల నుంచి వచ్చిన డబ్బును 'పే పాల్ ద్వారా స్వీకరించి, పది శాతం కమీషన్ మినాహాయించుకుని, మిగిలిన నిధులను మాకు పంపడానికి మధ్యవర్తులు కావాలి. సదరు ఔత్సాహికులు పేపాల్ ఖాతాకు సంబంధించిన వ్యవహారాలను తమంతతామే నిర్వహించుకోవాలి. ఖాతా వివరాలను కంపెనీకి అందజేయాలి. ఇంతకు మునుపు చెప్పినట్లుగా కొన్ని చట్టపరమైన కారణాల వల్ల 'పేపాల్ వ్యవహారాలలో కంపెనీ జోక్యం చేసుకోదు. ఆసక్తి వుంటే సంప్రదించండి' అదీ సారాంశం. 'కంపెనీవాడు మనల్ని పైసా కూడా అడగటం లేదు. పై పెచ్చు ముందు డబ్బు మన చేతికే వస్తుంది. మన కమీషన్ మనం వుంచుకుని, మిగిలిందే కదా కంపెనీకి పంపేది. వారానికి తొమ్మిది వేలు కాకపోయినా... హీనపక్షం రెండొందల డాలర్లొచ్చినా చేదుకాదుకదా! అని వెంటనే విలియం ఫాక్స్ కు ఇ-మెయిలు పంపాడు. తర్వాత పనులన్నీ చకచకా రెండు రోజుల్లో జరిగిపోయాయి. సురేష్ తన పేరు మీద 'పేపాల్' అకౌంట్ ఓపెన్ చేశాడు. లెస్ క్రైం కంపెనీవాళ్ళు మోసం చేసే అవకాశాలు కనిపించకపోవడంతో 'పే పాల్ ' వాళ్ళకు తన క్రెడిట్ కార్డును, బేంకు అకౌంటును గేరంటీగా ఇచ్చాడు. విలియం ఫాక్స్ 'కంగ్రాచ్యులేషన్' చెప్పడానికి కాల్ చేసి అడిగినప్పుడు 'పే పాల్' అకౌంటు వివరాలను చెప్పాడు. చెయ్యాల్సిన పని పెద్ద కష్టంగా అనిపించలా. కుదిరినప్పుడు 'పే పాల్' అకౌంటుకెళ్ళి ఎంత డబ్బుందో చూసుకోవడమే! ఇంత చిన్న పనికి పది శాతం కమీషన్ ఇచ్చేది... ఈ తెలివి తక్కువ తెల్లవాళ్ళే అనుకున్నాడు. భార్యకు ఈ విషయం చెబుదామా వద్దా అని ఆలోచించాడు. ఇప్పుడు చెబితే ఏదో అడ్డు పుల్ల వేస్తుందని, ఒక నెల రోజుల తర్వాత సంపాదించిన డబ్బు చూపించి ఆశ్చర్యపరచొచ్చనీ అనుకున్నాడు. తర్వాత రోజు నుంచీ పని ప్రారంభించాడు. మొదటి రెండు రోజులూ ఏమీ ఆర్డర్లు రాకపోయినా, తర్వాత ఒకటీ, రెండూ రావడం మొదలైంది. మొదటి రెండు వారాల్లో దాదాపు పదిహేను వేల డాలర్లు సురేష్ ఖాతాలో జమయ్యాయి. అంటే కమిషన్ కింద 1500 డాలర్లు సురేష్ కు దక్కుతాయి. డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా అని చాలా ఆశ్చర్యపోయాడు. ఈ రకంగా ఆర్డర్లు వస్తే, తనిప్పుడు చేస్తున్న ఉద్యోగాన్నొదిలేసినా ఫర్లేదనుకున్నాడు. ఆ వీకెండులో చలపతి వాళ్ళింట్లో చిన్న పాట్ లక్ పార్టీకి వెళ్లినప్పుడు, తను చేస్తున్న ఈ సైడు బిజినెస్సు గురించి ఎవరికీ చెప్పకుండా ఉండడానికి చాలా కష్టపడాల్సి వొచ్చింది. సాధారణంగా ఎవరితోనూ పెద్దగా మాట్లాడనిసురేష్, ఆ వారమే ఉద్యోగం పోగొట్టుకుని ఉసూరుమంటూ కూర్చున్న సుబ్బారావుకు ఎన్నో ధైర్యవచనాలు చెప్పాడు. తీరిగ్గా తననొకసారి కలిస్తే డబ్బు సంపాదించే మార్గం చెబుతానని చెప్పాడు. 'కష్టాల్లో ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళం ఆదుకోకపోతే ఎలా?' అని అన్నాడు. తర్వాత వారం సురేష్ పేరు మీద మరో ముప్ఫై అయిదు వేలకు చెక్కొచ్చింది, పేపాల్ కంపెనీ నుంచి. అంటే ఇప్పటి వరకు తనకొచ్చే కమిషన్ అయిదు వేలు! ఇంకా పొంగిపోయాడు సురేష్. మూడు వారాల్లో ఒక గంటపాటు, ఈ మెయిలు, పేపాల్ అకౌంటు చూసుకుంటూ ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుంటే ఇంత డబ్బా అనుకున్నాడు. దీన్లో ఏమీ మోసం లేదుకదా అని ఆలోచించాడు. కానీ ఎదురుగా అంత డబ్బు కనిపిస్తూండడం, అదీ తన అకౌంటులోనే ఉండడం వల్ల... 'అబ్బా అలా ఎందుకు మోసం చేస్తారులే' అనుకున్నాడు. లోకమంతా మంచిగా కనిపించింది. ఆకౌంటులో యాభై వేలుంది కదా... దీన్నంతా తీసుకుని, పారిపోతే ఎలా వుంటుందీ అనుకున్నాడు. బంగారు బాతు గుడ్డు కథ గుర్తొచ్చింది. వారం వారం ఇంతింత డబ్బొస్తొంటే... కక్కుర్తిపడి మూడువారాల డబ్బుతో పారిపోవడం తెలివితక్కువ పని అనుకున్నాడు వెంటనే తన కమిషన్ డబ్బు తనుంచుకుని, మిగిలిన డబ్బును కంపెనీకి వైర్ ట్రాన్స ఫర్ చేశాడు. ఇంకో రెండు మూడు రోజుల్లో, తను చేస్తోన్న పని గురించి భార్యకు చెప్పి ఆశ్చర్యపరుద్దామనుకున్నాడు.

కానీ, డిన్నర్ చేసేటప్పుడు వచ్చిన ఫోన్ 'పే పాల్' వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పటివరకూ తాము చెక్కుల రూపంలో పంపిన డబ్బుని వీలైనంత త్వరలో వాపసు ఇమ్మని. అలా ఇవ్వని పక్షంలో కలక్షన్ ఏజెన్సీకి డబ్బులు వసూలు చేసే బాధ్యతను అప్పగిస్తామనీను. కలెక్షన్ ఏజంటంటే కాబూలీవాడన్నమాట. 'కోర్టుకెడితే సరి! 'పే పాల్' వాళ్ళు నన్నో వెర్రివాజమ్మనుకుంటున్నారు. అసలు ముందు విలియం ఫాక్స్ కు ఫోను చేస్తే... అంతా ఆ కంపెనీయే చుసుకుంటుంది' అనుకున్నాడు గానీ, సురేష్ కు నిద్ర పట్టలేదు. 0-0-0 ఉదయం లేచేసరికి కాస్త ఆలస్యమైంది. అప్పటికే సుజాత నిద్రలేచి, కంప్యూటర్ ముందు కూర్చుని ఉంది. 'ఖర్మకాలి తనకంతా తెలిసిపోలేదు కదా' అనుకుంటూ, నెమ్మదిగా తన కంప్యూటర్ గదిలోకి వెళ్ళాడు. అప్పటికే విలయం ఫాక్స్ కూ, సురేష్ కూ మధ్య నడిచిన ఈ మెయిల్స్ చూస్తోంది సుజాత. 'అసలిదంతా ఏమిటి?' అని అడిగింది సుజాత కోపంగా. 'నిన్ను సర్ ప్రైజ్ చేద్దామని ఇప్పటిదాకా చెప్పలేదు. రేపో, ఎల్లుండో చెబుదామనుకున్నా' నిజమే చెప్పాడు సురేష్. సుజాత ఏమీ మాట్లాడలేదు. ఆమెకు బాగా కోపం వచ్చిందని గ్రహించి, ఇవ్వాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది కదా అనుకుని జరిగిందంతా చెప్పాడు. 'రాత్రి ఫోను పేపాల్ వాళ్ళ దగ్గర నుంచి. నా అకౌంటులో సాఫ్ట్వేర్ కొనడానికి ఉపయోగించిన క్రెడిట్ కార్టులన్నీ దొంగలించబడ్డ క్రెడిట్ కార్డులట... అందుచేత క్రెడిట్ కార్డు కంపెనీలు 'పేపాల్' వాళ్ళకు డబ్బివ్వమంటున్నారట. దాంతో పేపాల్ వాళ్ళు ఇప్పటి వరకు నాకు పంపిన డబ్బంతా వాపసు ఇవ్వమంటున్నారు' చెప్పాడు సురేష్. 'మొత్తం ఎంత కట్టాలి?' అడిగింది. 'దాదాపు నలభై అయిదు వేలు... కమీషన్ రూపంలో నాకొచ్చింది కలిపితే యాభై వేలు.... చెప్పాడు నేల చూపులు చూస్తూ. 'దొంగ క్రెడిట్ కార్డులన్నప్పుడు, పేపాల్ వాళ్ళు అసలెందుకు యాక్సెప్ట్ చేశారు' అడిగింది. 'అప్పటికి అవి దొంగ కార్డులని తెలియదు కదా. దీనంతటికి క్రెడిట్ కార్డు కంపెనీ వాళ్ళే బాధ్యత వహించాలి' చెప్పాడు సురేష్. 'మరిప్పుడు మనమేం చేయాలి' అడిగింది సుజాత. నేను విలియం ఫాక్స్ కు ఫోను చేసి మెసేజీ పెట్టా. ఈ మెయిలు కూడా పంపా. అయినా మనమంత వర్రీ కావాల్సిన పని లేదు' చెప్పాడు సురేష్. 'ఎవరినైనా లాయర్ని కలుద్దాం పదండి' అంది సుజాత. 'లాయరెందుకూ... వాడికిచ్చే ఫీజు వేస్టు...' అని కాస్సేపు నసిగినా, చివరకు బయలుదేరాడు... భార్యను శాంతపర్చడానికి అన్నట్లు. 0-0-0

విలియం ఫాక్స్ కూ సురేష్ కూ మధ్య నడిచిన ఈ మెయిల్స్ ను, పేపాల్ వాళ్ళు పంపిన చెక్కుల ఓచర్లను, విలియం ఫాక్స్ కు సురేష్ డబ్బు పంపిన రసీదులను లాయరుకు చూపించాడు. అంతా పరిశీలించిన లాయరు, 'దొంగ క్రెడిట్ కార్డులని తేలడంతో, క్రెడిట్ కార్డ్ కంపెనీలు పేపాల్ వాళ్ళను, తామిచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయమంటున్నారు. పేపాల్ వాళ్ల క్రెడిట్ కార్డుల వాళ్ళకు డబ్బు ఇచ్చేసి, ఇప్పుడు మీ వెనుక పడ్డారు' అన్నారు, కళ్ళద్దాలను పక్కన పెడుతూ. 'ఆ విషయం మాకూ అర్థమైంది... నీకు ఫీజిచ్చి మరీ అదే విషయాన్ని తెలుసుకోవడానికి మేమిక్కడకు రాలేదు' అని మనసులో అనుకొని, పైకి మాత్రం, 'మరి ఆ డబ్బును నేను విలియం ఫాక్స్ కు పంపేశానుగా' అన్నాడు. 'ఎలా పంపావు... చెక్కు రూపంలోనా?' అన్నాడు లాయర్. 'కాష్ ట్రాన్సాక్షన్... వెస్ట్రన్ యూనియన్ కంపెనీ ద్వారా' 'నువ్వు కష్టమర్లకు సాఫ్ట్వేర్ సీడీలను షిప్ చేసినట్లు లిఖితపూర్వకమైన ఆధారాలేమైనా ఉన్నాయా?! 'లేవు.... నేను కేవలం మధ్యవర్తిని. నాకు నా నేనే కష్టమర్లకు సీడీలు షిప్ చేయలేదు. అదంతా ఆ కంపెనీ చూసుకుంటుంది' చెప్పాడు సురేష్. 'బహుశా అసలా కంపెనీయే ఉండి ఉండకపోవచ్చు'అన్నాడు లాయర్. మరిప్పుడెలా? అడిగింది సుజాత. 'మీరు పెద్దగా చేయగలిగిందేమీ లేదు...' అన్నాడు లాయర్, సురేష్ ఇచ్చిన పేర్లను తిరిగి ఇచ్చేస్తూ. 'అంటే పేపాల్ వాళ్ళకు మేమే డబ్బు కట్టేయాలంటారా?!' అడిగాడు సురేష్. 'అవును... ఆ విలియమ్ ఫాక్స్ గానీ ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడో అయితే... మీరు కావాలనే ఈ ఫ్రాడ్ చేసి, నిధుల్ని వాడికి అందించారని ప్రభుత్వం మీ మీద కేసు పెట్టొచ్చు. విలయం ఫాక్స్ అలాంటి వాడు కాకూడదనుకుంటున్నాను నేను' అన్నాడు లాయర్. 0-0-0

దారిలో సుజాత మౌనంగా ఉంది. తుఫాను ముందు ప్రశాంతత అనుకున్నాడు సురేష్. ఎంత ఆలోచించినా తన తప్పేమీ కనిపించలేదిందులో. ఇంటికి చేరగానే, 'నేనిండియా వెళ్ళిపోతాను. టికెట్ తీసుకోండి' అని చెప్పింది సురేష్ తో. 'ఎందుకూ?' అడిగాడు సురేష్. 'మీకు తెలియదా?' ఎదురు ప్రశ్న వేసింది. 'ఇప్పుడు జరిగినదాంట్లో నా తప్పేముందీ... ఇంకో లాయర్ని కలుద్దాం' అన్నాడు సురేష్. 'పదండి కలుద్దాం... ఈసారి విడాకులిప్పించే లాయర్ని' అంది. 'ఎందుకూ ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తావ్. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వసలు ఇండియా వెళ్దాం అనబట్టే కదా నేనĹ

Share by EmailYour comments
Can't read the txt? click here to refresh.