Articles - Ajaramaram




Name: Devender Chintala

Published Date: 28-11-2015


అజరామరం

రచన: చింతల దేవేందర్, kendriya vidyalaya karimngar 
అయోద్యానగరం


నగరవాసులంతా పండుగజేసుకుంటున్నారు. ప్రజల్లో కల్గిన సంతోషం అంతాఇంతా కాదు. దశరథమహారాజుకు 
సంతానం కల్గింది. నలుగురు కుమారులు జన్మించారని తెల్సి అయోద్య రాజ్యమంతా తెగ సంబరపడసాగింది.
దశరథుల వారు ఆనందంతో ప్రజలకు నగలూ నట్రలు, ధనదాన్యాలు పంచిపెడ్తున్నారు.

నగర్ ద్వారాలన్ని శోభాయమానంగా పుశ్హ్పాలతో అలంకరిపబడ్డాయి. వీధీమలుపుల్లో స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు అందంగ, ఆనందంగా. వీధులు, ఇంటిముంగిట కళ్ళాపి జల్లి అందమైన రంగవల్లులు వివిధమైన రీతిలో తీర్చిదిద్దారు ఆడపడచులు.

సభ జరిపారు దశరథమహారాజు.
సదస్యులంతా ఆనందంగా వున్నారు. ఆస్థాన పండితులు, ఆచార్యులైన వశిష్టుల వారివైపు దశరథమహారాజు తన ఆనందనయనాలతో చూస్తూ, "గురువుగారూ! తమరు యజ్ణయాగాదులు, క్రతువులు, హోమాలు నిర్వహించండి. రాజ్యంలో శాంతిసౌబ్రాతృత్వం వెల్లివిరిసేలా హవన కార్యక్రమాలు నిర్వహించండి. భగవత్సంకల్పం వల్ల నాకు కల్గిన కుమారులకు నామకరణాలు సాధ్యమైనంత త్వరలో చేయగలరని ఆశిస్తున్నాను" అనగానే, వశిష్టులవారు, " మహారాజా! తమకి కల్గిన సంతానం వల్ల అయోద్యరాజ్యం ఆనందమయమైంది. తమరు ఆదేశించిన మేరకు క్రతువుల్ని, హోమాల్ని యాజకులు, రుత్విక్కులతో నిర్వహించి త్వరలోనే నామకరణాల్ని ఉత్సవరూపంలో పూర్తి చేయగలనని విశ్వసిస్తున్నాను" అని సభకి వందనాలు సమర్పించి సభనుండి తన ఆశ్రమానికి చేరుకున్నారు వశిష్టులు.
* * *

ఇరవైరోజులుగా యజ్ణాలు, యాగాలు క్రతువులు, హోమాలు నిర్వహిస్తూనే వున్నారు యాగశాలలొ వశిష్టులవారు రుత్విక్కుల సహాయంతో. అన్నీ సజావుగా సాగుతున్నాయి. కాని మహారాజు కుమారులకు పెట్టాల్సిన నామాలు ఏవీ స్పురణకి రావడంలేదు వశిష్టులవారికి. 

తనకే ఆశ్చర్యం వేసింది ఇంతగా శమపడ్తున్నా ఏదీ గోచరించడం లేదు తన గ్రహచార దోషమేమైనా వుందేమోనని తాళపత్రాల్ని సైతం పరిశీలించారు వశిష్టులు. ఎక్కడా ఏలోపం, దోషం లేదు. పంచాగాన్ని తిరిగేసి దశరథనందనుల జన్మించిన తిథి,వారాల్ని పరిశీలించి చూసిన ఏదీ కన్పించడం లేదు. ఆలోచనలో పడిపోయారు వశిష్ఠులు.
ఆశ్చర్యచకితులై, అయోమయంలో వున్న పతి వశిష్ఠులవారిని అరుంధతి గమనించసాగింది.
ఇవన్ని పసిగట్టిన సాధ్విమణి అరుంధతి, వశిష్టులవారితో,"స్వామీ! ఎందుకిలా వున్నారు?" అంటూ ప్రశ్నించింది. అప్పుడు వశిష్ఠులు "దేవీ! నేను లోగడ పంచాంగం తిరగవేయకుండానే వేళ్ళమీదుగా లెక్కలు గడించి, గ్రహచార,గోచార ఫలితాల్ని చెప్పేవాణ్ణి. కాని దశరథులవారి కుమారుల నామాల్ని,గోచారఫలితాల్ని చూడటానికి పంచాంగం చూసినప్పటికీ ఏదీ గోచరించడం లేదు గత ఇరువై రోజులుగా క్రతువుల్ని సైతం నిర్వహిస్తున్నాను. ఐనప్పటికి వారి నామాలు స్పురణకి రావడం లేదు. మహరాజుల విధించిన గడువు కూడా పూర్తి కావచ్చింది. ఎలా? " అని సతి అరుంధతి వైపు ప్రశార్థకంగా చూశారు వశిష్ఠులు.
వశిష్ఠుల వదనంలో విచారం గోచరిస్తున్నప్పటికీ, వెలుగు మాత్రం వశిష్ఠంగా వెలిగి పోతుంది. పతి వదనంలోకి అలాచూస్తుండగానే అరుంధతికి ఏదో ఠక్కున స్పురణకి వచ్చింది.

" స్వామీ! ఇందులో మీ దోషం లేదు. సమస్త సంశయాల్ని తీర్చేందులకి త్రిలోకసంచారి నారదమహర్షి ఉండనే వున్నారు. వారిని ఉపాసించండి. సమస్యకి పరిష్కారం చూయిస్తార"ని చెప్పింది అరుంధతి.
ఉన్నపళంగా ఉపాసనకి ఉద్యుక్తుడయ్యారు వశిష్ఠులు మహదానందంగా.
* * *

"బ్రహ్మర్షీ! వశిష్ఠా!" అంటూ వశిష్ఠులు సల్పుతున్న ఉపాసన స్థలానికి చేరుకున్నారు నారదులు. నారదుల ఆగమాన్ని తెల్సుకుని ఉపాసనకి స్వస్తి పలికి, నారదుల వారిని ఉచిత రీతిన సేవలందించారు వశిష్ఠులు, అరుంధతి.

ఆచార్య దంపతుల గౌరవ మర్యాదలకి ప్రసన్నులైన నారద మహర్షి " ఏవిటీ విశేషం?" అని వశిష్ఠులవారి వైపు చూస్తూ నుడివారు నారదులు.
"మహర్షీ త్రిలోకసంచారీ నారదా! నాసమస్య చిన్నదే! అయినా జటిలమైనది. ఇరువై రోజులుగా క్రతువులు, హోమాలు, యాగాదులు రుత్విక్కుల సహాయంతో నిర్వహిస్తున్నాను. దశరథమహారాజుకు కల్గిన కుమారుల నామాల్ని ఖరారు చేసిపెట్టాల్సిందిగా ఆదేశించారు దశరథమహారాజు. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు వల్లె వేసినప్పటికినీ ఒక్కనామం సైతం మదిలో మెదలడం లేదు. అందుకే మిమ్మల్ని ఉపాసించాను. మనసారా మన్నించి నాకు నామనిర్దేశానికి దిశానిర్దేశం చేయగలరని" వేడుకున్నారు వశిష్ఠులు. నారదులు తనలో తాను నవ్వుకున్నారు.

నారాయణ మంత్రాన్ని సదాకీరించే తనకు తన తాతగారి అంశగా భూవిపై వెలసిన విష్ణుమూర్తి నామాన్ని, మనవడినైన నాకు నామాన్ని సమకూర్చే మహాభాగ్యాన్ని లభింపజేసిన తండ్రిగారైన బ్రహ్మకి, తాతగారైన నారాయణుడికి మనసులోనే వేవేల కృతజ్ణతాంజనలు తెల్పి,వశిష్ఠుల వారివైపు ఆరాధనగా చూస్తూ, నారదులు, "ఆచార్యా! మీకు కల్గిన ఇబ్బందికి కారణం భగవదంశతో జన్మించిన దశరథతనయులు లోకంలో ధన్యులు. వారి నామాలు తమ స్పురణకి రాకపోవడం కారణం రాజకార్యం, రుషికార్యంతో పాటు దైవకార్యం కూడా తోడ్పడాల్. అందుకే ఈ జాగు. కారణ జన్ముడు, ధర్మరక్షాపరాయణుడు ఆదర్శమూర్తి, సత్యవాక్కుపరాయణుడు అయినవాడు ధశరథకుమారుల్లో అగ్రజుడు. మిగతాకుమారులు అగ్రజుని ఆచరించడమే కాకుండా సోదరభావం,ధరణీపై ధర్మానికి ప్రతిరూపమైన అగ్రజుణ్ణి అనుసరించేవారే. ఆయన నామాన్ని జపిస్తే సకల పాపాలు పరిహారమౌతాయి. కీడు చేడు దరిదాపుల్లోకి రావు,చేరవు. అంతటి మహత్తు కల్గిన అపురూపమైన నామం. ఆ నామకీర్తన వల్ల జన్మలు ధన్యత జెంది పరిమూరణమౌతాయి. సర్వజనుల నాళికపై సరళంగా, సహజంగా పల్కగల్గే నామమై వుండాలి.

విష్ణు మూర్తి అష్టాక్షరిలోని ఓ బీజాక్షరం, శివపంచాక్షరిలోని ఓ బీజాక్షరం కూడితే రమ్యమైన నామం ఏర్పడుంది. ఆ నామమే జగత్త్కళ్యానికి హేతువవుతుంది. వశిష్టా! నీ వదనంలోని ప్రసన్నం చెప్పకనే చెబుతుంది. నీకా మధురమైన, మనోహరమైన నామం గోచరించిందని. ఆ నామమే అజరామరమౌతుంది. నేడు తమరు సంకల్పించిన చోట దశరథనందనులకి నామ కరణాన్ని ఆనందంగా నిర్వహించి జనులందరికి మేలుజేయం"డంటూ అంతర్ధానమైపోయారు నారదులు.

వశిష్ఠుల వారికి ఇదంతా కలయో వైష్ణవమాయో అన్పించింది. నవ్వుకున్నారు వశిష్ఠులు. ఇంతతేలికైన పదం తనకెందుకు తట్టలేదో అర్థమైంది. అపూరూపమైననామాన్ని ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న దశరథులు, పురజనులకి విన్పించనా అంటూ అయోద్య స్భకి దారితీశారు నామకరణమహోత్సవాన్ని నిర్వహించడానికి తన సతి అరుంధతితో వశిష్ఠులవారు మహదానందంగా.

 



Share by Email



Your comments
Can't read the txt? click here to refresh.