Kavithalu - Samanyayam Samanatvam

Share by Facebook Share by Email


Name: Suravi

Published Date: 13-04-2018


సమన్యాయం సమన్వయం

 జరుగుతుందా సమానత్వం...
మసిపూసిన మానవత్వం నిసిగ్గుగా నిలుచుంది
నగ్నత నిజమని తలవంచింది
ఇది సమానత్వం అంటావా ... ఓ జాగృతి

బేధం అనే ఏర్పాట్లలో భేరీజు వేసుకుంటూ
మోసం అనే చీకటిలో మగ్గిపోతూ బ్రతుకుతున్నాం
జాతి అనే భ్రమలో ఎవరో ఒకరు లాభపడమే తప్ప
సమాజ అంకురార్పణ సాధించిందా
ఇది సమానత్వం అంటావా ... ఓ జాగృతి


తప్పు ఒప్పుల మాట దేముడుకి ఎరుక
అన్యాయం అద్దంలో చూపుతూ అవహేళన చేస్తుంది
ఎవరికైనా ఒకటే ముక్తి ఈ జాతికి లేదు విముక్తి

మగజాతి అంటే మదం ... ఇలాగె చూస్తుంది ఈ ప్రపంచం
ఇది సమానత్వం అంటావా ... ఓ జాగృతి


మల్లె తీగ మీద రాయడానికి కవితలు బోలెడు వస్తాయి
మనసు మౌనం మీద చదవటానికి ఎన్ని హృదయాలున్నాయి
రెండు వైపులా ఒకటే న్యాయం ఉండదా

లోతుల ఆలోచిస్తే ఈ శ్రీ అహంకారం దొరకదా
ఇది సమానత్వం అంటావా ... ఓ జాగృతి

 

 


Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.