Kavithalu - Mouna Prsthanam

Share by Facebook Share by Email


Name: Vishwa

Published Date: 16-04-2018


మౌన ప్రస్థానం ..
తెల్లటి తెరలపై భావాలు అలవోకగా
అక్షరాలు ఏ రంగైతే నేమి..
 
లోతుల హృదయ భావోద్వేగం
ఆగిన గుండె చప్పుడుతో పనిలేకుండా
లిఖించుకుంటు పోతోంది..
గమ్యమేదైతేనేమి..
 
దేదీప్యమైన శాంతి జ్వాల 
రంగుల సోయగాలు వెదజల్లుతూ
రూపుదిద్దుకుంటున్న కవితాకృతిని గమనిస్తూ..
కాలాన్ని స్తబ్దు చేసి
నిరాలోచనగా జరిగిపోతూ
ఒక చిరునవ్వుని పూచింది
కళ్ళ కాంతి పుంజాలలో సూర్యుని అద్వైత ప్రతిబింబం
బారులు తీరిన మేఘాల వరుసపై..
నీలి ఆకాశమెంత ఉంటేనేమి..
 
మదనం జరుగుతూనే ఉంది
చిలికిన మజ్జిగ వెన్న ను తేల్చాలికదా
అంతులేని రసస్పందనలు
జిహ్వలను చైతన్యపరచాలిగా
దివ్యత్వం స్వయం ప్రకాశితమయ్యేవరకు..
సాధనలు పెక్కులు నిశ్శబ్ద అంతరంగంలో
అలజడులు ఎన్నుంటే నేమి..
 
అయస్కాంత క్షేత్ర ధృవాలు కాంతిచాలనం లో
లిప్తలు నిలబడి భాష్యాలు వెదుకుతూ
శూన్య జగత్తు ధారణలో
పవిత్ర దార్శనికలతో
విరిసిన మందార ముఖారవిందము
తలపులలో నిండినపుడు
అణువణువున ఉప్పొంగిన అమృతసారం..
భౌతిక శబ్ధ మేళవింపును కరిగింపజేసి
సాకారమైన ప్రజ్ఞను తత్వపరిచి
స్థాణువు నిండిన కల్పమందు రాత్రులను నిర్వచిస్తూ
శీతల పవనాలను నింపి గుండె గది నిండా
ప్రబోధమయ్యె అంతర్వాణి
పరధర్మాలు ఎన్నుంటేనేమి..
 
హాయినిండిన హంసలతలు
దివిటీలు వెలిగిస్తూ
సుదూర పర్వత శ్రేణుల వైపు
భవ్యమంగళములకు శ్రీకారం చుడుతూ..
అంతు చిక్కని పయనాన్ని కొనసాగిస్తూ...

Share by Facebook Share by Email  Share this Image



Your comments
Can't read the txt? click here to refresh.