అరికాల్లు అరిగేట్లు, ఒల్లంత ఒరిగేట్లు,
నడిచినట్టి మనుషుల వెనక..
కష్టాలు తీరేట్లు, సిరులన్ని పండేట్లు,
ఏ పుణ్యాలు నడిచాయి గనక..
తిరుపతి కొండనెక్కి, తలనీలాలు తనకిచ్చి,
పాపాన్నే కడిగేశామంటూ, మళ్ళీ కొత్తవి
చేయచ్చంటూ,,
సొంతవాల్లనే తిరస్కరించి, చెత్త
ఆస్తిని సంపాదించి,
ఆ పాపపుసొమ్మును భాగంచేసి, ఆ భాగాన్నే
నైవేద్యం చేసి,
దేవుడినే భాగస్తుని చేసి, తనవాటాగా
ఆ నైవేద్యాన్నిస్తే....
మీ పాపాలన్నీ పరిష్కారమా, మీ నేరాలన్నీ
నివురులాయనా...
వరుసలలో నిలుచున్న ఒక్కోడిదో వరస,
ముందరున్న దేవుడిదేమో ఇంకో వరస...
మీ అప్పులన్ని తీర్చమని మీరు కోరితే,
మీ దక్షణనే తన అప్పుగ లెక్కలేయడా...
గుప్పెడు వరిగింజలే ప్రతిపూటకు గతిలేని,
ఓ పేదవాడు నీకోసం పరమాన్నం పెట్టేనా....
అసలుమాట పక్కనుంచి తన వడ్డీలే కట్టలేని,
ఆ వెంకన్నే దిగివచ్చి నీ అప్పులు కట్టేనా....
నువ్వన్నా చెప్పన్నా..కొండపైన వెంకన్నా..
నీ సంగతి తెలిసినా, నిన్నే నమ్మినారన్నా...
ప్రశాంతతకు మారుపేరు కొండపైన నీ ఊరు,
ఏ భక్తునికి తెలుసుగనక లోపలున్న నీతీరు...
ప్రతి దిక్కున పాటలతో నీ కష్టాలను మరిపించి,
పలు పేర్లతొ పిలిచి నిన్ను మునగచెట్టు ఎక్కించి...
వరుసనున్న ప్రతిఒకరో కష్టాన్నే సందిస్తే...
అవి తగిలి కింద పడలేక, ఆ మునగచెట్టు దిగలేక,
ఆ కష్టాలను అందుకొని,నీ తలబారాన్ని పెంచుకొని,
నీ భార్యలనే చేరుకొని, వాల్లచేత తిట్లు తిని,
బుంగమూతి పెట్టుకొని, బువ్వకూడ తినకుండా,
ప్రసాదాలు పట్టుకొని, కొసరి కొసరి తింటావు...
కొండనెక్కి కోట్లకొలది నిన్నుచేరి చూసినా,
నీ కష్టాలను అడగరు, తమ కష్టాన్నే చెప్పేరు...
నిను చూచుటకే వచ్చామని వీల్లు పలికినా,
తమ స్వార్థాలకు నీ మహిమను కోరువారు కాదా...
వడ్డీకాసులవాడా అని ప్రేమగా పిలిచినా,
వడ్డీ కట్టలేనోడా అనే తిట్టు దాగిలేదా...
ఈ జిమ్మిక్కులు తెలుసుకోర వెర్రినాయనా,
నీ సంసారం చూసుకోర బుజ్జినాయనా...
ఏడుకొండలపైన వెలిసిన ఓ వెంకన్న,,
నిను ఏడిపించి వెల్లేకే ఈ భక్తుడన్నవాడన్నా...
నువ్వన్నా చెప్పన్నా , కొండపైన వెంకన్నా,
నీ సంగతి తెలిసినా, నిన్నే నమ్మినారన్నా...
ఉచితాలను ఉచితంగా శ్వీకరించు మానవా..
దేవుల్లను నమ్మింది చాలు నాయనా,
నిన్ను నువ్వు నమ్ముకోర వెర్రినాయనా...
నిజాయితీ వెంటనే దేవుడొచ్చురా..
కష్టమున్న చోటనే అదృష్టముండురా..
ఈ నిజమును తెలుసుకొని నడువురా దొరా...
నీ కష్టాన్నే నమ్ముకొని బతుకు సోదరా...
Share this Image