Kavithalu - Evarivi Nee vevarivi

Share by Facebook Share by Email


Name: Savitha Bura

Published Date: 01-12-2015


క్కన చెక్కిన శిల్పానివా  
జాజి మల్లికి మించిన అందానివా 
ఉషోదయపు తుషార బిందువువా ...!
ఎవరివి  నీ వెవరివి ... 

వసంత కాలపు కోకిల గానానివా  
 హరివిల్లు లోని సప్త వర్ణాల రంగవల్లివా  
పుడమి పులకించే చిరు జల్లు ముత్యానివా  ..!!
ఎవరివి  నీ వెవరివి  ..

శరత్ రుతువు హిమబిందు మెరుపువా 
కలువను మించిన కన్నులున్నసోయగానివా  
వరూదిని ని మించిన విరహానివా ...!!!
ఎవరివి నీ వెవరివి  ..... 

నా మనసు దోచిన మృదు మంజీర నాదానివా  
నా ఎదలో కొలువై వెలుగుతున్న దివ్య దీపానివా  
నా  హృదయ వీణను మీటిన  సప్త స్వరాల  సరిగమవా  ...!!!!
ఎవరివి  నీ వెవరివి  .......

Share by Facebook Share by Email  Share this Image



Comments

kavitha

[email protected]

wow...intha andamaina kavitha post chesinanduku chala thanks


Your comments
Can't read the txt? click here to refresh.